ప్రియుడి కోసం సొంత తమ్ముడినే చంపుకుంది ఓ హీరోయిన్. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడనే నెపంతో తన ప్రియుడితో కలిసి అడ్డు తొలగించుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇదం ప్రేమమ్ జీవనమ్, ఒందు గంటేయ కథ లో నటించిన శనయా కాట్వే, సెలబ్రిటీ మేనేజర్‌గా పని చేస్తున్న నియాజ్ అహ్మద్‌తో ప్రేమలో ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న శనయా సోదరుడు రాకేష్ సోదరిని హెచ్చరించారు. దీంతో ప్రేమకు అడ్డొచ్చేలా ఉన్నాడని శనయా, ఆమె ప్రియుడు నియాజ్ కు విషయం చెప్పింది.
అయితే నియాజ్ రాకేశ్ ను అంతమొందించాలని డిసైడ్ అయ్యాడు. పథకం ప్రకారం తన స్నేహితులతో రాకేశ్ ను అంతమొందించాడు. మొదట మృతదేహాన్ని కారులో దాచారు. అయితే ఆ మృతదేహం కుళ్లి వాసన వస్తే దొరికిపోతామని భావించి, మృతదేహాన్ని నరికి హుబ్బళ్లి పరిసర ప్రాంతాల్లో విసిరేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడింది నియాజ్ అని గుర్తించారు. ఈ హత్య వెనుక రాకేశ్ సోదరి కూడా ఉందని తెలుసుకుని ఆమెను కూడా అరెస్ట్ చేశారు.