Friday, November 22, 2024

నాకు పాజిటివ్ కాదు – హీరోయిన్ అంజలి

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వకీల్ సాబ్ హీరోయిన్ నివేతా థామస్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈమేర స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే తాజాగా నటి అంజలికి కూడా కరోనా పాజిటివ్ అంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐసొలేషన్ లో కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

కాగా అసలు విషయానికి వస్తే నివేతా థామస్ కు పాజిటివ్ రావటంతో తాను కూడా టెస్ట్ చేయించుకుందట. కానీ ఎలాంటి పాజిటివ్ రాలేదట. ఇదే విషయాన్ని చెబుతూ అంజలి ట్వీట్ చేసింది.కాగా అంజలి నివేతా థామస్ లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా రేపు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement