భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని కలిశారు తమిళ్ స్టార్ హీరో విశాల్. తన సోదరి తో కలిసి విశాల్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో సమావేశమయ్యారు. ఇదే విషయాన్ని చెబుతూ విశాల్ ట్వీట్ చేశారు. వెంకయ్య నాయుడుతో అనేక విషయాలు చర్చించానని… ఆయన చేపడుతున్న సామాజిక కార్యక్రమాలపై మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చారు.
వెంకయ్య నాయుడితో సమావేశం సంతృప్తికరంగా ఉందని అన్నారు విశాల్. కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్ అనే పుస్తకాన్ని విశాల్ కు వెంకయ్య నాయుడు బహుకరించారు.