బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 57ఏళ్ల వయసు వచ్చినా బ్యాచిలర్ గా మిగిలిపోయారు. కాగా ఆయనకో పెళ్లి ప్రపోజల్ వచ్చింది. కానీ తనకు పెళ్లి చేసుకునే వయసు దాటిపోయిందన్నాడు సల్మాన్. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు (ఐఫా)-2023 వేడుకలు దుబాయ్ లో జరుగుతున్నాయి. బాలీవుడ్ నుంచి చాలా మంది తారలు తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో సల్మాన్ మాట్లాడుతుండగా.. ఓ లేడీ రిపోర్టర్ ప్రపోజ్ చేసింది. సల్మాన్ మీ కోసమే నేను హాలీవుడ్ నుంచి వచ్చాను. మిమ్మల్ని చూసినప్పుడే నేను మీతో ప్రేమలో పడిపోయాను అని ఆమె చెబుతుండగానే.. మీరు షారుక్ గురించి మాట్లాడుతున్నారు కదా అంటూ సల్మాన్ జోక్ చేశారు. దీంతో ఆమె.. లేదు.. నేను సల్మాన్ గురించే మాట్లాడుతున్నా.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని మళ్లీ అడిగింది. దీంతో సల్మాన్ కాస్త నిరాశను ప్రదర్శిస్తూ నాకు పెళ్లి వయసు దాటిపోయింది.. 20 ఏళ్ల క్రితం నువ్వు నన్ను కలిసి ఉంటే బాగుండేది అని సరదాగా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement