కర్ణాటకలోని బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమ…. డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలపై కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బెయిల్ పై విడుదలైన హేమ తాను డ్రగ్స్ తీసుకోలేదని మొదటి నుంచి చెబుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా హేమ మరోసారి బెంగళూరు రేవ్ పార్టీ కేసు గురించి మాట్లాడుతున్న వీడియోను విడుదల చేసింది.
‘‘నేను బెంగళూరు రేవ్ పార్టీ కోసం కొన్ని పరీక్షలు చేయించుకున్నాను. అన్ని పరీక్షలు నెగెటివ్‌గా వచ్చాయి. ఈ విషయాన్ని ఇప్పటికే పుల మీడియా ఛానళ్లకు చెప్పాను. అవసరమైతే ఓపెన్ టెస్టులకు సిద్ధమే. నాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ ఇప్పించేందుకు సహకరించండి’’ అంటూ వేడుకుంది. తాను టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చిన రిపోర్టులను వీడియోలో చూపించింది. దీంతో హేమ షేర్ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.