Tuesday, November 12, 2024

Helping Hands – వ‌య‌నాడ్ బాధితులకు అండగా సినీరంగం

సాయం చేసేందుకు ముందుకొస్తున్న నటీ నటులు
నయనతార, విఘ్నేశ్ దంపతుల ఔదార్యం
భారీ విరాళం అందజేత, లేఖలో వెల్లడి
క‌మ‌ల్ , సూర్య, జ్యోతిక, మమ్ముట్టి, దుల్కర్ సాయం
పెద్ద ఎత్తున స్పందిస్తున్న తమిళ, కన్నడ సినీ వర్గాలు

కేరళ రాష్ట్రం వయనాడ్‌లో విషాదంపై పలువురు సినీ తారలు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో విపత్తులో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దంపతులు ముందుకొచ్చారు. తమ వంతు సాయంగా ₹20 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. అదేవిధంగా వయనాడ్‌లోని ప్రజల జీవితాలను పునర్నిర్మించడానికి తమ మద్దతును తెలియజేస్తూ ఒక లేఖ కూడా రాశారు. ‘వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన విషాద‌క‌ర ఘ‌ట‌న‌ మా హృదయాలను క‌లిచివేసింది. సమాజం అనుభవిస్తున్న విధ్వంసం, నష్టాలు దయనీయంగా ఉన్నాయి. ఇలాంటి విపత్కర సమయాల్లో ఒకరికొకరు ఆదుకోవడం చాలా ముఖ్యం. అందుకే బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం కోసం మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 20లక్షలు అందిస్తున్నాము’ అని ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

- Advertisement -

సాయం అందించిన సూర్య, జ్యోతిక, దుల్కర్..​

మరోవైపు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘లక్కీ భాస్కర్’ మూవీ టీమ్ కూడా ₹5లక్షల సాయం ప్రకటించింది. కాగా, ఇప్పటికే పలువురు స్టార్స్‌ విరాళాలు అందించారు. విక్రమ్​ ₹20 లక్షలు, హీరో సూర్య ఫ్యామిలీ జ్యోతిక, హీరో కార్తి కలిసి సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ₹50 లక్షలను అందించారు. అదేవిధంగా మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కలిసి ₹35 లక్షలు, ఫహాద్‌ ఫాజిల్ ₹25 లక్షలు, రష్మిక ₹10 లక్షలు విరాళంగా అందించారు. ఇక క‌మల్ హాస‌న్ కూడా 25 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement