నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇటీవలే యూవీ క్రియేషన్స్ నిర్మాత విక్రమ్‌తో కలిసి వి మెగా పిక్చర్స్ అనే కొత్త ప్రొడక్షన్ సంస్థను స్టార్ట్ చేశారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే క్రమంలో ఈ ప్రొడక్షన్ సంస్థను స్టార్ట్ చేసినట్లు ఈ సంస్థ తెలిపింది. తాజాగా ఈ సంస్థ తమ మొదటి సినిమాను ప్రకటించింది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్న హీరో నిఖిల్‌తో తొలి చిత్రాన్ని చేయనున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. ఈ సినిమాకు ది ఇండియా హౌజ్ అనే పేరును ఫిక్స్ చేశారు. రామ్ వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి వి మెగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది.
ఈ మేరకు చిత్రబృందం ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది 1900 దశకం సమయంలో భారతదేశ చరిత్ర పుటల్లో లేని ఒక అధ్యాయాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు చిత్రబృందం వీడియోలో పేర్కొంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా లండన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. నిఖిల్ ఈ సినిమాలో శివ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఏజెంట్ గెటప్‌లో సూట్‌కేసు పట్టుకున్న నిఖిల్ లుక్ అదిరిపోయింది. అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటిస్తున్నారు.
రామ్ చరణ్ ప్రొడక్షన్ లో.. తొలి హీరోగా నిఖిల్
Advertisement
తాజా వార్తలు
Advertisement