Friday, November 22, 2024

HBD – ఆపద్బాంధవుడు అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, దర్శకనిర్మాతలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తన బర్త్ డే కావడంతో గురువారం ఉదయం సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చిరంజీవి దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలను అందచేశారు.

మరోవైపు చిరు బర్త్ డే కావడం ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇంద్ర ను రీరిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తుంది.

- Advertisement -

ఇదిలా ఉంటే.. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తన దృష్టిలో చిరంజీవి ఆపద్భాంధవుడు అంటూ ట్వీట్ చేశారు.“నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు. అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో! గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవిగారు ఆశీర్వదించారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుడిని మనసారా కోరుకుంటున్నా” అంటూ పవన్ పేర్కొన్నారు.

.కొణిదెల శివశంకర్ వరప్రసాద్.. 1955 ఆగస్ట్ 22న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి స్వయంకృషితో మెగాస్టార్ గా మారారు. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా అభిమానులు రక్తదానం, అన్నదానం తదితర సేవాకార్యక్రమాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement