Saturday, November 23, 2024

కూతురిని పరిచయం చేసిన హరితేజ

ప్రముఖ నటి యాంకర్ హరితేజ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు వెండితెరపై కూడా సందడి చేస్తూ ఉంటుంది. ఇక ఇటీవల హరితేజ కు ఓ పాప పుట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పెళ్లి రోజు సందర్భంగా తన కూతురు ఫోటో సోషల్ మీడియాలో మొదటి సారి షేర్ చేసింది. పాప రాకతో తమ వివాహ వార్షికోత్సవం మరింత ప్రత్యేకం గా మారిందని చెప్పుకొచ్చింది. బిడ్డను ఎత్తుకొని భర్త దీపక్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా నెటిజన్లు కూడా హరితేజ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక హరితేజ గతంలో రాజా ది గ్రేట్, హిట్ ,సరిలేరు నీకెవ్వరు, ప్రతి రోజు పండగే, అ ఆ,ఎఫ్2, అరవింద సమేత, యూటర్న్, శ్రీనివాస్ కళ్యాణం వంటి చిత్రాల్లో నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement