పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు టీజర్ విడుదల కాబోతుంది అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హడావిడిగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడు పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉండడం అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా కొంత భేదాభిప్రాయాలు రావడంతో మరికొంత ఆలస్యమైంది.
అయితే మొత్తానికి ఈ సమస్య నుంచి వీరమల్లుకి ఒక సొల్యూషన్ దొరికినట్లు అనిపిస్తుంది. క్రిష్ దర్శకత్వం వహించినప్పటికీ దీన్ని పూర్తి చేసే బాధ్యతను నిర్మాత కొడుకు జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. రెండు భాగాలుగా రానున్న వీరమల్లు పార్ట్1 కు స్వార్డ్ vs స్పిరిట్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఇక టీజర్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను మరింత హైలెట్ చేసే విధంగా చూపించారు అంతేకాకుండా సినిమాలోని అసలు పాయింట్ కూడా రివీల్ చేశారు. దేశంలో దొరల పాలన, నవాబుల దాడులు ఎక్కువైనప్పుడు అలాగే మొఘల్ చక్రవర్తులు ఆధిపత్యం ఉన్నప్పుడు పేదవాళ్లు ఎంతగా ఇబ్బంది పడ్డారు అనే కాన్సెప్ట్ ను టచ్ చేస్తూనే వారిని ఎదిరించే దీరుడుగా వీరమల్లును చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మనల్ని దొర దొచుకుంటే ఆ దొరను నవాబు దోచుకుంటాడు.. ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొగల్ చక్రవర్తి దోచుకుంటాడు.. మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి భగవంతుడు కచ్చితంగా ఒకడిని పంపిస్తాడు.. అంటూ సినిమాలోని అసలు అంశాన్ని టీజర్ లో చాలా చక్కగా చూపించారు. హీరో క్యారెక్టర్ తో పాటు సినిమాలో సన్ని డియోల్ మొఘల్ చక్రవర్తిగా కనిపించిన విధానం కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.
దర్శకుడు క్రిష్ ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ వీరమల్లు క్యారెక్టర్ యుద్ధ విద్యలతో ఆరితేరి విలన్స్ ను ఊచకోత కొస్తాడు అని అర్థం అవుతుంది. ఇక దర్శకుడు ఈ సినిమాను సగానికి పైగానే ఫినిష్ చేశాడు. ఇక దర్శకుడు క్రిష్ సగానికి పైగా షూటింగ్ పూర్తి చేయగా నిర్మాత కొడుకు కృష్ణ ఫీనిషింగ్ టచ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అతను ముందు నుంచి కూడా ఈ సినిమా ప్రొడక్షన్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. అయితే క్రిష్ ఎందుకు తప్పుకున్నాడు అసలు కారణమేంటి అనే విషయంలో ఇప్పటివరకు మేకర్స్ సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. టీజర్ లోనే ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా అనిపిస్తోంది. ఇక నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ టీజర్ ద్వారా చెప్పిన మరొక గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఈ ఏడాదిలోనే సినిమాలను విడుదల చేయాలని అనుకుంటున్నారు.