Monday, November 18, 2024

నా జీవితంలో ప్రత్యేకమైన నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు..గోపిచంద్

యాక్షన్ హీరో గోపీచంద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట విలన్ గా మెప్పించిన గోపీచంద్… ప్రస్తుతం హీరోగా కూడా నిలదొక్కుకున్నాడు. అయితే సరైన హిట్ మాత్రం గోపీచంద్ కు తగల్లేదు. ఇదిలా ఉండగా గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సిటిమార్ సినిమా చేస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. అయితే గోపీచంద్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు.

కాగా 2013లో గోపీచంద్ రేష్మ ను వివాహం చేసుకున్నారు. అయితే గురువారం గోపీచంద్ పెళ్లి రోజు ఈ సందర్భంగా భార్యతో కలిసి ఉన్న ఓ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు గోపిచంద్. ఈ ప్రపంచంలోనే ఇలాంటి అద్భుతమైన బహుమతి లేనే లేదు. నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన నీకు పెళ్లిరోజుశుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు గోపీచంద్.

https://www.instagram.com/p/COzWec_JisC/?igshid=wt4bo432wylv

Advertisement

తాజా వార్తలు

Advertisement