ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వం ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ హారో మూవీ హను మన్. సంక్రాంతికి రిలీజైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో దుమ్మురేపుతోంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించిన ఈ సూపర్ హీరో మూవీ.. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయికి చేరుకుని నిర్మాతకు లాభాల పంటను పండిస్తోంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతుంది.
కాగా, ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. హనుమాన్ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ రైట్స్ కలిపి దాదాపు 30 కోట్లకు జీ5 కొనుగోలు చేసినట్లు సమాచారం. రిలీజ్ అయిన నాలుగు వారాల తరువాత ఓటీటీలో చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అయితే, హనుమాన్ బ్లాక్‌బస్టర్ కావడంతో ఓటీటీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. అనుకున్నదానికంటే ఆలస్యంగా.. రెండు నెలల గ్యాప్ తర్వాతే హనుమాన్ ఓటీటీలో రిలీజ్ చేయాలని జీ5 సంస్థను నిర్మాతలు కోరినట్లు సమాచారం. అంటే మార్చి నెలాఖరులోగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చే చాన్స్ ఉంది.