Friday, November 22, 2024

Hanuman Movie Review .. సూప‌ర్ హీరోగా హనుమాన్…సంక్రాంతికి విజువ‌ల్ వండ‌ర్ ….

హ‌నుమాన్ మూవీ రివ్యూ…
నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్ కుమార్, అమ్రితా అయ్యర్, వెన్నెల కిశోర్, వినయ్ రాయ్, సత్య, గెటప్ శీను, దీపక్ శెట్టి తదితరులు
ఛాయాగ్రహణం: దాశరధి శివేంద్ర
సంగీతం: అనుదీప్ దేవ్, గౌర హరి, కృష్ణ సౌరభ్
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమా తెరకెక్కింది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయనకు జోడిగా అమృత అయ్యర్ నటించింది. ఈ సినిమా సంక్రాంతి పండగ సంధర్భంగా ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది మనం రివ్యూలో చూసేద్దాం.

కథ: అంజనాద్రి అనే ఊరిలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు హనుమంతు (తేజ సజ్జ). అతడికి అమృత (అమృత అయ్యర్) అంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం. తమ ఊరిని గుప్పెట్లో పెట్టుకున్న పాలెగాళ్లకు ఎదురు వెళ్లడంతో బందుపొట్లను పంపి ఆమెని చంపాలని చూస్తారు. వాళ్ళ నుండి ను కాపాడే ప్రయత్నంలో చావు బతుకుల మధ్య సముద్రంలో పడిపోతాడు హనుమంతు. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడి వచ్చాక హనుమంతు ఒక్కసారిగా అంతులేని శక్తిమంతుడిగా మారతాడు. అతడికి ఆ శక్తి ఎలా వచ్చింది.. ఆ శక్తిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ దుష్టుడితో హనుమంతు పోరాడి ఎలా గెలిచాడు అన్నది మిగతా కథ.

విశ్లేష‌ణ‌…
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సూపర్ హీరో కథ అయినప్పటికీ దీనిని ఆంజనేయ స్వామి భక్తితో మిళితం చేసిన విధానం ఆకట్టుకుంటుంది. కథని నెమ్మదిగా ప్రారంభించి ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు ఆడియన్స్ ని కట్టిపడేసాడు. ఆంజనేయ స్వామి షాట్స్ అయితే థియేటర్స్ లో భక్తిని నింపడమే కాదు గూస్ బంప్స్ వచ్చేలా చేస్తున్నాయి. 50 కోట్ల బడ్జెట్ లోపే ప్రశాంత్ వర్మ ఈ విజువల్ వండర్ ని సృష్టించారు. ..తేజ సజ్జా తన పాత్రలో ఒదిగిపోయి పెర్ఫామ్ చేశాడు. తేజ సజ్జా, వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య సన్నివేశాలు ఎంతో అందంగా వర్కౌట్ అయ్యాయి. ఎమోషనల్ ఎలివేట్ అయ్యాయి. మూవీ చివర్లో చిన్న ట్విస్ట్ తో పార్ట్ 2 ని కూడా ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశాడు. ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ నంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాటోగ్ర‌ఫీ. సంగీతం, బిజి, పాట‌లు, గ్రాఫిక్స్, విజువ‌ల్స్ అదిరిపోయాయి… ఇది 50 కోట్ల సినిమా కాదు 500 కోట్ల సినిమాలా రూపొందించారు.. తేజ సజ్జా లాంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బుల్లి హీరోతో సూపర్ హీరో సినిమా చేయడం అంటే మామూలు సాహసం కాదు. అది కూడా తక్కువ బడ్జెట్ లో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో ప్రశాంత్ వర్మ మిరాకిల్ చేశాడు. దీనితో ప్రశాంత్ వర్మ ట్యాలెంట్ కి ధైర్యానికిసోషల్ మీడియా ఫిదా అవుతోంది. చివ‌ర‌గా సంక్రాంతికి ఇంటిల్ల‌పాది చూడ‌ద‌గ్గ చిత్రం.. ఒక వైపు భ‌క్తి, మ‌రో వైపు సూప‌ర్ శ‌క్తి….అదిరిపోయే ఎండింగ్… ఇంత‌కంటే ప్రేక్ష‌క‌లకు ఏం కావాలి….చూసేయండి మ‌రి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement