Saturday, November 23, 2024

గిన్నిస్​ బుక్​లో చోటు దక్కించుకున్న మనసానమః షార్ట్​ ఫిలిమ్..

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సోంత టాలెంట్ తో అరుదైన రికార్డ్ సృష్టిచాడు దీపక్ రెడ్డి అనే ఒక యువ ద‌ర్శ‌కుడు. అతను రూపోందించిన‌ షార్ట్ ఫిలిం ‘మనసానమః’ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకుని గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు పొందిన షార్ట్ ఫిలింగా ‘మనసానమః’ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. దీపక్ రెడ్డి తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా వివిధ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై 513 అవార్డులు అందుకుంది. పలువురు స్టార్లు కూడా ఈ షార్ట్ ఫిలిం చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. వినూత్న టెక్నిక్ తో తెరకెక్కిన తెలుగు షార్ట్ ఫిలిం ‘మనసానమః’ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించ‌డంతో.. ఈ విషయాన్ని సదరు దర్శకుడు తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘మనసానమః’ షార్ట్ ఫిలింలో విరాజ్ అశ్విన్, దృషిక చందర్, వల్లీ రాఘవేందర్, పృథ్వి శర్మ తదితరులు నటించారు. ఓ యువకుడు ముగ్గురు అమ్మాయిలతో వేర్వేరుగా ప్రేమలో పడడాన్ని ఈ షార్ట్ ఫిలింలో చూపించారు. ఈ మూడు ప్రేమ కథలు ముగింపు సీన్ నుంచి మొదలై ప్రారంభంతో ముగుస్తాయి. ఈ టెక్నిక్ కారణంగానే ‘మనసానమః’ షార్ట్ ఫిలింకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. యంగ్ డైరెక్టర్ దీపక్ రెడ్డికి టాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉందని విమర్శకుల ప్రశంసలు లభించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement