గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. రామ్ చరణ్ కి ఓ ప్రముఖ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. తమిళనాడు చెన్నైలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. కళారంగానికి చరణ్ చేసిన సేవలకు గాను ఈ డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నట్టు యూనివర్సిటీ వెల్లడించింది.
ఏప్రిల్ 13న చెన్నైలోని పల్లవరంలో వేల్స్ వర్సిటీ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఏఐసీటీఈ అధ్యక్షుడు డీజీ సీతారాం… రామ్ చరణ్ కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. దీంతో చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్తో వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా, ఆ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.