సీనియర్ నటి గౌతమి కొంత విరామం తర్వాత మళ్లి నటిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో గౌతమి నటిస్తోంది. ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ గౌతమి మీడియా సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ఈ సినిమా మీకు సెకండ్ ఇన్నింగ్.. థర్డ్ ఇన్నింగ్?
ఎలా అయినా అనుకోవచ్చు. ఇన్నింగ్ ఉండటమే సంతోషం.
ఇప్పటికీ షూటింగ్, సినిమాని ఎంజాయ్ చేయగలు గుతున్నారా ?
ఎంజాయ్ చేయగలుగుతున్నాను కాబట్టే ఇంకా చేయగలుగుతున్నాను. ఈ విషయంలో సంతోషపడుతున్నా ను.. ఒక రకంగా గర్వపడుతున్నాడు. సినిమా నా ఫస్ట్ లవ్ అనే అనొచ్చు. సినిమా అనేది ఎండ్ లెస్. నటిగా కాకుండా సినిమాకి సంబధించిన చాలా విభాగాల్లో పని చేశాను. ఇప్ప టికీ అదే ఎక్సయిట్ మెంట్. నేర్చుకోవడానికి చాలా వుంది.
ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా వుంటు-ంది ?
నా పాత్ర పేరు మీనాక్షి. చాలా లవ్లీ క్యారెక్టర్. ఒక డ్రీమ్ మదర్, వైఫ్, ఫ్రెండ్ ఎలా వుండాలని వుంటు-ందో మీనాక్షి పాత్ర అలా వుంటు-ంది. ముఖ్యంగా నా కెరీర్ ప్రారంభంలో రాజేంద్రప్రసాద్‌గారితో నటించాను. మళ్ళీ ఇప్పుడు అదే జోడిలో చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఈ సినిమాలోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది ?
స్వప్నగారు ఫోన్ చేశారు. గౌతమి గారు ఇందులో ఒక పాత్ర వుంది. మీరు తప్ప ఎవరూ కనిపించడం లేదు. ఒకసారి వింటారా ? అని అడిగారు. విన్నాను. చాలా నచ్చింది. అలా జర్నీ మొదలైయింది.
ఈ చిత్రంలో మహిళా దర్శకురాలు, మహిళా నిర్మాత.. అంతా ఫిమేల్ డామినేషన్ కనిపిస్తుంది కదా ?
మంచిదే కదండీ . అయితే నేను ఎప్పుడూ జెండర్‌ని బట్టి ప్రతిభ, సామర్థ్యాన్ని జడ్జ్ చేయను. ఒక లక్ష్యం వుంటే దాని కోసం ఎవరైనా ప్రయత్నించాల్సిందే.
టీ-జర్ లో కొబ్బరి నీళ్ళు సీన్ చాలా బ్యూటిఫుల్‌గా వుంది.. అలాంటి సీన్స్ ఇంకా వుంటాయా ?
వాటిని మీరు తెరపై చూడాల్సిందే. నందిని గారు ఒకొక్క పాత్రని చాలా బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకుల మనసులో ఒక హాయి వుంటు-ంది.
కొత్త సినిమాలు గురించి ?
బోయపాటి గారి సినిమా చేస్తున్నాను. అలాగే ఒక వెబ్ సిరీస్ పూర్తయింది. అలాగే మరో అమెజాన్ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి.
మీ ప్రాజెక్ట్స్ చూస్తుంటే.. వచ్చిన గ్యాప్ ని ఫిల్ చేయడానికి ప్రయత్ని స్తున్నారని అనుకోవచ్చా ?
నేను వర్క్ హాలిక్. ఏదో పని ఉండాల్సిందే. ఇన్నాళ్ల తర్వాత కూడా ఇలాంటి మంచి పాత్రలు వెతుక్కుంటూ రావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను.
మీ అమ్మాయికి నటన ఆసక్తి ఉందా ?
మా అమ్మాయి ఫిల్మ్ మేకింగ్ చదువుతోంది. తనకు కెమెరా వెనుక ఉండటం ఇష్టం.