Tuesday, November 26, 2024

గోపీచంద్..రేష్మ‌ల 10వ పెళ్లిరోజు.. ప్యారిస్ లో వేడుక‌లు

హీరో గోపీచంద్ త‌న భార్య రేష్మ‌తో క‌లిసి ప‌ద‌వ పెళ్లిరోజుని ప్యారిస్ లో జ‌రిపారు. ఆ బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు హీరో గోపీచంద్. అయితే, గోపీచంద్ ఆ పిక్స్ ను షేర్ చేసేందుకు ఓ రీజన్ ఉంది. మే13న వాళ్ల పెళ్లిరోజు. 2013లో గోపీచంద్ రేష్మ వివాహం ఘనంగా జరిగింది. నేటితో వీరి వివాహ బంధం పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ప్యారిస్ లో తన భార్యతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే బ్యూటఫుల్ ఫొటోషూట్ తో ఆకట్టుకున్నారు. ఫొటోలను షేర్ చేయడంతో అభిమానులతో పాటు అందరూ విషెస్ తెలుపుతున్నారు. గోపీచంద్ ఆ ఫొటోలను పంచుకుంటూ తన భ్యార గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఇన్నాళ్లూ నీతో కలిసి చేసిన ప్రయాణం అద్భుతమైనది. నిన్ను నా భార్యగా పొంద‌డం నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితాన్ని పరిపూర్ణం చేశావు అంటూ యానివర్సరీ విషెస్ తెలిపారు. గోపీచంద్ – రేష్మలకు ఇద్దరు సంతానం. ఇద్దరూ కొడుకులే. మొదటి బాబు విరాట్ క్రిష్ణ, రెండో బాబు వియాన్. ఇక గోపీచంద్ భార్య రేష్మ విషయానికొస్తే.. ఆమె మరెవరో కాదు సీనియర్ నటుడు శ్రీకాంత్ సొంత మేనకొడలు. ఆయన సొంత అక్క కూతురినే గోపీచంద్ పెళ్లి చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement