Friday, September 6, 2024

UAE | మంచు విష్ణుకు గోల్డెన్ వీసా…

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం తాజాగా టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణుకు గోల్డెన్ వీసా అందుకున్నారు. ఆర్ట్స్ & కల్పర్ కు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తిస్తూ అబుదాబిలోని సంస్కృతిక, పర్యాటక శాఖ ప్రతిష్టాత్మక యూఏఈ గోల్డెన్ వీసాను మంచు విష్ణుకు మంజూరు చేసింది. యూఏఈ గోల్డెన్ వీసా అందుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు విష్ణు.

కాగా, మంచు విష్ణు కంటే ముందే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. వీరితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. అటు కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూడా ఈ గోల్డెన్ వీసా లభించింది. ఇప్పుడు గోల్డెన్ వీసా అందుకున్న‌ సెలబ్రిటీల జాబితాలోకి మంచు విష్ణు కూడా చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement