ప్రియాంక చోప్రా కజిన్ మీరా చోప్రా పెళ్లి చర్చనీయాంశమైంది. వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‌తో మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లి చేసుకుంది. ఈ జంట పెళ్లి 12న జైపూర్‌లో జరిగింది. జైపూర్‌లోని బ్యూనా విస్టా లగ్జరీ గార్డెన్ స్పా రిసార్ట్‌లో వివాహం జరిగింది. మెహెందీ – సంగీత్ వేడుకలు 11న జరిగాయి.
ఇప్పుడు, మీరా తన పెళ్లికి సంబంధించిన కొన్ని అద్భుతమైన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆహ్వాన కార్డ్, హల్దీ, సాత్ ఫెరాస్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పెళ్లిలో మీరా చోప్రా ఎరుపు రంగు డిజైనర్ లెహంగా ధరించి ఎంతో అందంగా కనిపించింది. ఎంబ్రాయిడరీ తో భారీతనం నిండిన ఈ లెహంగా లుక్ మీరా అందాన్ని పదింతలు పెంచింది. వరుడు పూర్తిగా రాయల్ వైట్ అండ్ వైట్ షేర్వాణీలో అందంగా కనిపించాడు. అతడు బ్రౌన్ గ్లాసెస్ ధరించి ఠీవిగా కనిపించాడు. మీరా పెళ్లి మండపంలోకి ప్రవేశించిన చిత్రాన్ని కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ మీరా ఇలా రాశారు, ఎప్పటికీ ఈ ఆనందం, తగాదాలు, నవ్వు, కన్నీళ్లు, జీవితకాల జ్ఞాపకాలలో... హర్ జనమ్ తేరే సాత్ #మేరా
అనే అందమైన క్యాప్షన్ ఇచ్చింది.