అందమైన భామల ఫ్యాషన్ ఎంపికలు ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా ఎంపిక చేసుకున్న డిజైనర్ గౌన్ కి స్ఫూర్తి ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా చాలా మంది డిజైనర్లు తాము ప్రకృతి నుంచి లేదా సముద్ర జలచరాల ఆకృతులను స్ఫూర్తిగా తీసుకుని డిజైనింగ్ చేస్తామని చెబుతుంటారు. అయితే ఇప్పుడు సారా అలీఖాన్ ఎంపిక చేసుకున్న దుస్తులు అందుకు అతీతం కాదు. ”ఈ రూపం చూడగానే రొయ్య పిల్లలా నిగనిగలాడుతోంది. టైగర్ రొయ్యలా ఊరిస్తోంది!” అంటూ అభిమానులు ఈ లుక్ పై కామెంట్లు చేస్తున్నారు. దానికి కారణం సారా ఎంపిక చేసుకున్న దుస్తుల డిజైన్ రొయ్య ఆకృతిని పోలి ఉండడమే. హోటల్లో ప్రాన్ ఫ్రైని లొట్టలేయడమే కాదు.. ఇలాంటి డిజైనర్ లుక్కులను రూపొందించగలమని సదరు ఫ్యాషన్ డిజైనర్ నిరూపించాడు! అంటూ కొందరు నెటిజనులు పొగిడేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement