బాలీవుడ్ చిత్రం కాశ్మీర్ ఫైల్స్ సంచనంగా మారింది. రాజకీయ విభేదాలకు దారితీసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ సినిమాపై పన్ను ఎత్తివేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది.దీనిపై ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ బుధవారం స్పందించారు. పన్ను మినహాయింపు ఇవ్వడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. బీజేపీ సూచనను స్వాగతిస్తాం. అయితే, ఈ పన్నుల్లో సగభాగం కేంద్రానికి వెళ్తున్నందున అక్కడి భాజపా ప్రభుత్వం కూడా పన్ను మినహాయింపుపై ప్రకటన చేస్తేబాగుంటుంది అని బదులిచ్చారు. రాయ్‌పూర్‌లోని ఓ మాల్‌లో సినిమాను చూడాల్సిందిగా ఎమ్మెల్యేలందరినీ ఆయన ఆహ్వానించారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత బీజేపీకి చెందిన విపక్షనేత ధర్మ్‌లాల్ కౌశిక్ మాట్లాడుతూ, ఛత్తీస్‌గఢ్‌లో కాశ్మీర్ ఫైల్స్‌కు పన్ను మినహాయింపును కోరారు. కౌశిక్ ప్రశ్నకు సీఎం బదులిస్తూ, ఈ చిత్రాన్ని చూడటానికి వెళ్దాం. పన్నులో భారత ప్రభుత్వానికి కూడా వాటా వెళ్తుంది కాబట్టి, దేశవ్యాప్తంగా ఈ సినిమాకు పన్ను మినహాయింపు అంశాన్ని కేంద్రమే చూడాలని చెప్పారు. ఈ సినిమాను చూడటం కాంగ్రెస్‌కు ఇష్టంలేదంటూ బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బ్రిజ్మోహన్ అగర్వాల్ ఆరోపణను సీఎం తోసిపుచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..