Sunday, November 24, 2024

Gayathri Gupta : కాస్టింగ్ కౌచ్ కు బ‌ల‌వుతుంది వాళ్లే…

తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉంటూ హైలైట్ అయ్యారు. అలాంటి వారిలో గాయత్రి గుప్తా ఒకరు. సినిమాల్లో పద్దతిగా కనిపించినా.. ఈ అమ్మడు బయట మాత్రం బోల్డుగా ఉంటూ హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ గురించి మొట్టమొదట లేవనెత్తి సెన్సేషన్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా.. మరోసారి కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘గతంలో నేను చేసిన పోరాటానికి అంతగా సహకారం అందలేదు. తర్వాత మరికొందరు నాలా పోరాడడం వల్లే ఇండస్ట్రీ స్పందించింది. ఇందుకోసం ఓ కమిటీని కూడా వేశారు. ఇప్పుడు చాలా మంది బాధితులకు అది ఒక ఫ్లాట్‌ఫాం అయింది’ అంటూ చెప్పుకొచ్చింది.

కాస్టింగ్ కౌచ్‌పై కామెంట్స్:ఇదే ఇంటర్వ్యూలో గాయత్రి గుప్తా కంటిన్యూ చేస్తూ.. ‘ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. అయితే, చాలా మంది హీరోయిన్లు ఇష్టంతోనే శృంగారం వంటివి చేస్తున్నారు. కొందరు మాత్రం అవసరాల కోసం చేస్తున్నారు. వీళ్లలో అమాయకపు అమ్మాయిలే ఎక్కువగా బలి అవుతున్నారు’ అని వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement