Saturday, November 23, 2024

బిడ్డకు పాలు ఇస్తే కాంట్రవర్శీ చేస్తారా: గాడోట్‌ సీరియస్

హాలీవుడ్ వండర్ ఉమెన్ గాల్ గాడోట్ తన బిడ్డకు పాలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. షూటింగ్‌ కోసం రెడీ అవుతున్న తరుణంలో.. టచప్‌ సందర్భంగా చనుబాలను పంపింగ్‌ చేస్తూ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది గాల్ గాడోట్. అయితే కొందరు పనిగట్టుకుని ఆమెను విమర్శించడం మొదలుపెట్టారు. అతి చేష్టల్లో భాగంగా ఆమె ఆ పని చేసిందంటూ మండిపడ్డారు. దీంతో గాడోట్‌ ఓ మీడియా హౌజ్‌ ద్వారా స్పందించింది. తల్లి పాల విలువేంటో చెప్పేందుకు తాను ఆ పని చేశానని క్లారిటీ ఇచ్చింది. తల్లయ్యాక తిరిగి పనుల్లోకి వెళ్లడం ఎంత కష్టమో ఆ విమర్శించే వాళ్లకు తెలిసి ఉండకపోవచ్చు. అది తెలియాలనే నా ఈ ప్రయత్నం. పైకి నవ్వుతూ ఉన్నా.. ఎల్లప్పుడూ బిడ్డల ఆకలి గురించి ఆలోచించే తల్లుళ్లకు జోహార్లు అంటూ చెంపపెట్టు సమాధానమిచ్చింది గాల్‌ గాడోట్‌. కాగా, ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లైన గాడోట్‌.. రెండు నెలల క్రితమే మూడో బిడ్డకు జన్మనిచ్చింది. గాడోట్‌ మాత్రమే కాదు.. గతంలో క్రిస్సి టెయిగెన్‌, లోకి నటి సోఫియా డి మార్టినో కూడా ఇలా సెట్స్‌ నుంచే పంపింగ్‌ ఫొటోలతో వార్తల్లో చర్చకు దారితీశారు.

ఇది కూడా చదవండి: సంతోష్‌ నగర్‌ గ్యాంగ్ రేప్.. కట్టుకథ భలే అల్లిందిగా!

Advertisement

తాజా వార్తలు

Advertisement