స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొడుతోంది నయనతార. అయితే నయనతార తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రస్తుతం ప్రేమలో ఉన్నారు. కాగా ఈ ఇద్దరిపై పెళ్లి పై గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా వీరి పెళ్లి పై ఓ స్పష్టత వచ్చింది. నెటిజన్స్ తో ముచ్చట పెట్టిన విగ్నేష్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వివాహం ఖరీదైనది అని… ఆ శుభ కార్యక్రమానికి డబ్బు ఆదా చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత వివాహం చేసుకోవాలని ఈ ఇద్దరూ అనుకుంటున్నారట. మరి చూడాలి కరోనా తగ్గిన తర్వాత ఈ ఇద్దరి పెళ్లి ఎప్పుడు ఎలా జరుగుతుందో.