Saturday, November 23, 2024

“ఫ్రం స్క్రాచ్ – ఎపిసోడ్-2”.. ప్రాజెక్ట్-కే నుండి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసిన మేక‌ర్స్

టాలీవుడ్‌లో భారీ అంచనాలతో తెర‌కెక్కున్న బిగ్ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్-కే. పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ప్రధాన జంటగా నటిస్తున్న ఈ బిగ్గీకి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఇవ్వాల ఈ మూవీలో రైడర్స్ అనే విల‌న్స్ యూనిఫాం గురించి “ఫ్రం స్క్రాచ్ – ఎపిసోడ్-2 అసెంబ్లింగ్ ది రైడర్స్” అంటూ ఒక‌ ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో, విల‌న్ ఆర్మీ యూనిఫాం త‌యారు చేయ‌డం కోసం కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనరావు, నితిన్ జిహానీతో పాటు పలువురు కలిసి పని చేయ‌డం చూడ‌వ‌చ్చు. అయితే ఇదివ‌ర‌కు “ఫ్రం స్క్రాచ్ – ఎపిసోడ్-1 రీ-ఇన్వెంటింగ్ ది వీల్” అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు మేక‌ర్స్. అందులో ఒక ట‌యర్ (వీల్) ని త‌యారు చేయ‌డం చూపించారు.

కాగా, విలన్ సైన్యం కాస్టూయ్ గురించి తెలుపుతూ రిలీజ్ చేసిన ఈ వీడియోలో.. విల‌న్ సైన్యం ఉపయోగించిన ఆయుధాల గురించి కూడా వీడియోలో కొన్ని క్లూస్ ఉన్నట్టు క‌నిపించింది. ఇక‌ మొత్తంమీద, వ‌చ్చే ఏడాది (జనవరి 12న) థియేట‌ర్లలో రిలీజ్ కానున్న ప్రాజెక్ట్-కే సినిమాపై అభిమానుల్లో అలాగే ప్రక్ష‌కుల్లో.. ఈ వీడియో మ‌రింత క్యూరియాసిటీని పెంచుతూ సినిమాపై మ‌రిన్ని అంచనాలను పెంచిందనే చెప్పాలి. ఇక‌, వైజయంతీ మూవీస్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న‌ ఈ బిగ్గీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, ఇతర ప్రముఖ నటీనటులు కూడా ఉన్నారు.

- Advertisement -
YouTube video

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement