కోలీవుడ్ భామ ప్రియాంక అరుల్ మోహన్ మొదటి నుంచి హోమ్లీ టైప్ క్యారెక్టర్లు ఎక్కువగా చేస్తోంది. గ్యాంగ్ లీడర్ సినిమాలో పక్కింటి అమ్మాయిలా చాలా అందంగా కనిపించిన అమ్మడు.. ఆ తరువాత పెద్దగా సక్సెస్ లు ఏమి అందుకోలేదు. ఇక ఇటీవల మాత్రం ఆమె టైమ్ గట్టిగానే నడుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ OG సినిమాలో ఎప్పుడైతే ఛాన్స్ అందుకుందో అప్పటి నుంచి ఆఫర్లు పెరుగుతున్నాయి. ఇక ప్రియాంక తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేసే ప్రయత్నం అయితే చేస్తోంది.
నానితో అమ్మడు మరో ఛాన్స్ అందుకుంది. ఇదివరకే వీరి కలయికలో గ్యాంగ్ లీడర్ అనే సినిమా వచ్చింది. ఇక ఇప్పుడు సరిపోదా శనివారం అనే సినిమా చేస్తోంది. ఇక కెరీర్ స్పీడ్ పెంచేందుకు తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది.. దీనికి ఫోటో షూట్ లను ఎంపిక చేసుకుంది.. గ్లామర్ పాత్రలకు సై అంటూనే లిప్ లాక్ నో అంటూ చిన్నసందేశం కూడా నిర్మాతలకు,దర్శకులు ఇచ్చేసింది..