Saturday, November 23, 2024

Ritika : మ‌త్య్స సుంద‌రి గా మాజీ విశ్వ‌సుంద‌రి

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ డిజైనర్ రితికా మిర్చందానీ రూపొందించిన ఈథెరియల్ జార్జెట్ సిల్వర్-గ్రే సీక్విన్డ్ చీరలో అంద‌రి దృష్టిని ఆకర్షించింది. స్టైలిష్ సైడ్ స్లిట్ లుక్ తో గుబులు రేపింది. తాజాగా భిన్న‌మైన రూపంతో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ కొత్త లుక్ లో మానుషి మ‌త్స్య‌క‌న్న‌ను త‌ల‌పించింది.

జ‌ల‌కాలాట‌లు ముగించి ఒడ్డుకు చేరిన మ‌త్స్యంలా క‌నిపించింది మానుషి. ఈ రూపం నిజంగా స‌మ్మోహ‌నుల్ని చేస్తోంది. సిల్వ‌ర్ క‌ల‌ర్ డిజైన‌ర్ చీర‌ల‌ లో ఈ బ్యూటీ మ‌తులు చెడ‌గొడుతోంది. ఒంటిపై చీర జారినా, ప‌రువుల ప్ర‌ద‌ర్శ‌న చేసినా చిల్ల‌ర్ చిరున‌వ్వుతోనే ప‌ల‌క‌రించింది.. ఈ ఫోటో అభిమానుల నుంచి స్పంద‌నలు అనూహ్యం. ఇది ఇలా ఉంటే 24 ఏళ్ల మానుషి హర్యానాలో జన్మించిన టాప్ మోడల్ కం న‌టి. మిస్ వ‌ర‌ల్డ్ గా కిరీటం అందుకున్నాక‌ పృథ్వీరాజ్- ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వంటి చిత్రాలతో పాటు అజయ్ దేవగన్ తో ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇటీవ‌ల‌ జాన్ తో సినిమా ప్రారంభ‌మైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement