రిపోర్టర్ పై దాడి ఘటనలో గాయపడ్డ రంజిత్ కు నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్వయంగా క్షమాపణలు చెప్పారు. తాను కోపంలో అలా చేశానని.. తనదే తప్పు అని అతని కుటుంబాన్ని క్షమాపణ కోరారు.
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు రంజిత్‌ను ఈరోజు మోహన్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా… దాడి జరిగిన రోజు తప్పు తనదేనని అంగీకరించారు. రంజిత్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మెహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా జర్నలిస్ట్ రంజిత్‌ను కలిసి పరమర్శించాడు.
మంచు కుటుంబ కలహాలను కవర్ చేసేందుకు తమ నివాసానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ క్రమంలో ఓ టీవీ చానెల్ రిపోర్టర్ రజింత్‌కు తీవ్రంగా గాయపడ్డాడు. మోహన్ బాబు దాడి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఈ ఘటనతో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదు అయ్యింది.