Wednesday, September 18, 2024

Filmfare | బేబీ సినిమాకు ఎన్ని అవార్డులో..

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన తారాగణంగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బేబీ’. నిర్మాత శ్రీనివాస్ కుమార్ నిర్మించిన ఈ సినిమా గతేడాది జూలైలో థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 10 కోట్లతో రూపొందిన బేబీ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

కాగా, తాజాగా బేబీ చిత్రం 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. 69వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం నిన్న రాత్రి హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. బేబీ మూవీకి.. బెస్ట్ మూవీ క్రిటిక్స్, బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ (వైష్ణవి చైతన్య), బెస్ట్ మేల్ సింగర్ – శ్రీరామచంద్ర (ఓ టూ లవ్ మేఘలీల), ఉత్తమ గీత రచయిత – అనంత్ శ్రీరామ్ (ఓ టూ లవ్ మేఘలీలా), ఉత్తమ సంగీత దర్శకుడు – విజయ్ బుల్గానిన్ అవార్డులు వచ్చాయి. దీంతో బేబీ టీమ్ అంతా హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ అవార్డులపై నిర్మాత ఎస్‌కెఎన్‌ స్పందిస్తూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement