ఓజిపై అంచనాలు మామూలుగా లేవు. అప్డేట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మోత మోగిపోతుంది. తాజాగా ఈ కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. అది కానీ నిజంగా నిజమైందంటే పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే. ఇంతకీ ఏంటా న్యూస్..? అసలు ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టరేనా లేదంటే వెనక కథేమైనా ఉందా..? ఇవన్నీ ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం.. ఈ ఒక్క టీజర్ తప్ప ఓజి నుంచి మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు.. బోనస్‌గా 2023లో రాదని తేల్చేసారు. ఐదేళ్ళ తర్వాత పవన్ చేస్తున్న స్ట్రెయిట్ ఇది.
తాజాగా ఓజి లీక్స్ వైరల్ అవుతున్నాయి. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని అర్థం. అయితే ఇక్కడ ఓజి అంటే ఓజాస్ గంభీర్ అంటున్నారు. 80ల నేపథ్యంలో సాగే ముంబై బేస్డ్ గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. ఓజి కథపై సోషల్ మీడియాలో లీక్స్ మొదలయ్యాయి. ముంబైకి మామూలుగా వచ్చిన ఓ వ్యక్తి.. గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు.. అలా మార్చిన పరిస్థితులేంటి అనేది ఈ చిత్ర కథ.ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను సుజీత్ హైలైట్ చేయనున్నారు. కథ మలుపు తిరిగేదే కుటుంబం వల్ల అని.. మాఫియా కారణంగా వాళ్లకేమైంది.. ఓజి అప్పుడేం చేస్తాడనే నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది.ఇది నిజమా అబద్ధమా పక్కనబెడితే.. ఈ మాత్రమైనా అప్డేట్ వచ్చిందిగా అని సంతోషిస్తున్నారు ఫ్యాన్స్. ఓజిని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుజీత్. యాక్షన్ బ్లాక్స్, హీరో ఎలివేషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారీయన.ఇంటర్వెల్, క్లైమాక్స్ నెక్ట్స్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారని.. ఫస్ట్ పార్ట్‌లో పవన్ గంట సేపు కనిపిస్తారని తెలుస్తుంది. ఎన్నికల తర్వాతే ఓజీ విడుదల కానుంది. 2025లో ఓజీ 2 వచ్చే ఛాన్స్ ఉంది.