Sunday, July 7, 2024

TG | సీఎం రేవంత్ రెడ్డి షరతులపై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్..

ఇటీవ‌ల‌ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కి కీలక సూచనలు చేశారు. సినిమాల్లో డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా వీడియోలు రూపొందించాలన్నారు. అలా చేయ‌ని సినిమాలకు టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదన్నారు. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అయినప్పటికీ సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలంటూ… సినిమా కంటే ముందు కానీ సినిమా తరువాత 3 నిమిషాలు వీడియోతో అవగాహన కల్పించాలని చెప్పారు.

కాగా, ఈ అంశం పై తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ స్పందించింది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ వంటి విషయాలలో చలన చిత్ర పరిశ్రమ ముందుండి ప్రభుత్వానికి అండగా ఉందనే విష‌యాన్ని తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ విషయం పై చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్స్ యాజమాన్యాలు.. డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టడానికి తమవంతు భాధ్యత నిర్వర్తించడానికి ఇకపైన కూడా ఎల్లవేళలా తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటుంది. దీనిపై అతి త్వరలో సీఎంను క‌ల‌వ‌నున్న‌ట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement