ప్రస్తుతం బాలీవుడ్‌లో హన్సిక మోత్వానీ-సోహైల్ కతురియాల వివాహం హాట్ టాపిక్ గా మారింది. హన్సిక తన లవర్, బిజినెస్ మెన్ సోహైల్ కతురియాతో రాజస్థాన్‌లో పెళ్లి చేసుకోనుంది. అయితే, హన్సిక-సోహైల్ వివాహం OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు తెలుస్తోంది. కానీ, అది ఏ OTT ప్లాట్‌ఫారమ్‌లో టెలికాస్ట్ అవుతుందనే దానిపై ఇప్పటివరకు ఎట్లాంటి ప్రకటన చేయలేదు..
ఇదిలా ఉండగా. డిసెంబర్ 4న వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. పెళ్లి తేదీకి సంబంధించి కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. హన్సికా ప్రీ వెడ్డింగ్ వేడుకలు డిసెంబర్ 2న ప్రారంభమవుతాయి. డిసెంబర్ 3న జరిగే మెహందీ, సంగీత్‌తో వేడుకలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత డిసెంబర్ 4న సాయంత్రం వివాహం జరగనుంది. రిసెప్షన్‌కు బదులుగా, రాత్రిపూట క్యాసినో నేపథ్యంతో కూడిన పార్టీ ఉంటుందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.