Saturday, January 4, 2025

Hit-3 | గుండెపోటుతో మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ షూటింగ్ లో విషాదం చోటుచేకుంది. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం కాశ్మీర్‌లో జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి పనిచేస్తున్న యువ సినిమాటోగ్రాఫర్ కుమారి కృష్ణ గుండెపోటుతో మరణించింది.

ఛాతిలో నొప్పి రావడంతో ఆమెను వెంటనే శ్రీనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అయితే కాస్త కోలుకున్న తర్వాత జనరల్ వార్డుకు తరలిస్తుండగా ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. కేరళలోని ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ ఘటనతో హిట్-3 చిత్ర యూనిట్ విషాదంలో మునిగిపోయింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement