పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ స్థాయిని పెంచేసింది. ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన ఈ హీరోను ఉత్తరాదికి పరిచయం చేసింది. అంతేకాదు సరైన సక్సెస్‌లు లేక ఢిలాపడిన బాలీవుడ్‌కు పుష్ప ఉత్సాహం కలిగించే హిట్ అందించింది. పుష్ప బాలీవుడ్‌లో మంచి రెవెన్యూ వస్తోందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మొదటివారంలో అంచనా వేసిన దానికి ఆ తర్వాత వస్తున్న రెవెన్యూకు పొంతనే లేదు. తెలుగు సినిమాలకు వస్తున్న కలెక్షన్లు హిందీ సినిమాలకు రావడం లేదని ప్రముఖ విశ్లేషకులు అంటున్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు పుష్ప గురించే చేశారని అర్థం అవుతోంది.
పుష్ప సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ నటించే కొత్త సినిమాల తీరు మారుతుందని భావించవచ్చు. పుష్ప 2 పూర్తిచేశాక, ఇకముందు అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా సినిమాల నిర్మాణం జరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ సంస్థ అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా సినిమా కోసం ఒప్పందం చేసుకుందని తెలిసింది. ఇందులో నటించేందుకు అల్లు అర్జున్‌కు రూ.75 కోట్లు పారితోషికం చెల్లిస్తారమని ప్రచారం జరుగుతోంది. అలాగే సుమారు 300 కోట్ల ఖర్చుతో సినిమా నిర్మాణం జరిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..