స్టార్ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాలో ఆయన కుమార్తె గా నటించిన అనికా గుర్తుంది కదా… అయితే అనికా కు ప్రస్తుతం మలయాళ సినిమాలలో హీరోయిన్ గా ఛాన్స్ కూడా ఛాన్స్ లు వస్తున్నాయి. అయితే ఈ అమ్మడికి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
ఇంస్టాగ్రామ్ లో అయితే పది లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆమెకు ఓ వీరాభిమాని అయిన ఓ యువకుడు ప్రేమలేఖ పంపించాడు. ఒకవేళ అవికా తన ప్రేమను అంగీకరించక పోతే ప్రాణం తీసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అతనికి రిప్లై ఇస్తూ… ప్రాణం విలువ ఏంటో వివరించింది అవికా. ఇటువంటి పనులు చేయద్దు అని చెప్పుకు వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.