మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని చూసి భావోద్వేగానికి లోనయ్యాడు ఓ కుర్రాడు. అవసరాల్లో ఉన్న ఫ్యాన్స్ ను ఆదుకోవడమే కాదు, తనను కలిసేందుకు వచ్చిన వారిని నిరుత్సాహపరచడని రామ్ చరణ్ కు గుర్తింపు ఉంది. కాగా, హైదరాబాద్ లో రామ్ చరణ్ తన ఫ్యాన్స్ తో సమావేశం నిర్వహిస్తున్నారని తెలిసి ఓ బాలుడు సుదూర ప్రాంతం నుంచి వచ్చాడు. ఆ యువ అభిమాని తన ఆరాధ్య హీరో రామ్ చరణ్ ను చూశాక తీవ్ర భావోద్వేగాలకు లోనై కన్నీటిపర్యంతమయ్యాడు. ఆ కుర్రాడిని రామ్ చరణ్ ఎంతో ఆప్యాయంగా పలకరించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుర్రాడు తిరిగి తన స్వస్థలానికి వెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకోవాలంటూ తన సిబ్బందికి పురమాయించారు. అంతేకాదు, ఆ బాలుడితో ఫొటో దిగి సంతోషపెట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement