Tuesday, November 26, 2024

ఫ్యామిలీ మ్యాన్ 2 బ్యాన్ చెయ్యాలి… కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం లేఖ

సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 జూన్ 4న రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ పై వివాదం నెలకొంది. సమంత పోషించిన ఎల్టిటిఈ టెర్రరిస్ట్ పాత్ర విషయంలో తమిళులు కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళ టైగర్లను చెడుగా చూపిస్తూ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు చూపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

దీనిపై వైగో అనే ఎంపీ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పుడు ఏకంగా తమిళనాడు ప్రభుత్వం ఇదే బాట లో మంత్రి ప్రకాష్ జవదేకర్ కు ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ లేఖ రాశారు. ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ తమిళ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని సమంత పోషించిన పాత్ర తమిళ టైగర్లను చెడుగా చూపించేలా కనిపిస్తోందని అన్ని రాజకీయ పక్షాలతో పాటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని లేఖలో పేర్కొన్నారు. మరి ఈ వివాదాల మధ్య ఇది రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement