Friday, October 4, 2024

Vettaiyan | డబ్బింగ్ ప్రారంభించిన ఫహద్ ఫాసిల్!

టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రదాన పాత్రలో నటిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌‌టైనర్ వేట్టైయన్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం డబ్బింగ్ దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ఫహద్ ఫాసిల్ డబ్బింగ్ ప్రారంభించాడు.. దీనికి సంబంధించి, చిత్ర బృందం ఫోటోలను పంచుకుంది.

ఈ భారీ బడ్జెట్ మూవీలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, GM సుందర్, రోహిణి మరియు రావు రమేష్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు పలు భాషల్లో అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement