మూడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత నెట్‌ఫ్లిక్స్ తన బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్లలో ఒకటైన ఎక్స్ట్రాక్షన్కి సీక్వెల్‌ను విడుదల చేసింది. అవేంజర్స్, థోర్ ఫేమ్ క్రిస్ హెమ్స్‌వర్త్ ప్రధాన పాత్రలో నటించిన ఎక్స్ట్రాక్షన్-2 శుక్రవారం (జూన్ 16) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. దర్శకుడు సామ్ హర్గ్రేవ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఉందా? లేదా అన్న విషయం తెలుసుకుందాం..
ఎక్స్ట్రాక్షన్-2 ఓ సాధారణ కథ.. చక్కటి స్క్రీన్‌ప్లేతో కూడిన మంచి యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. అయితే ఇది ప్రీక్వెల్ అంత గొప్పగా లేదు. కానీ, క్రిస్ హెమ్స్‌వర్త్ నటన.. యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకి ఊపిరి పోశాయి. యాక్షన్ సినిమా లవర్స్ కి ఈ సినిమా ఇంకా బాగా నచ్చే చాన్స్ ఉంది. కొన్ని ఓవర్ ది టాప్ స్టంట్స్, అనవసరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఈ వీకెండ్ లో చూడదగ్గ సినిమాగా చెప్పుకోవచ్చు.
స్టోరీ..
టైలర్ రేక్ (క్రిస్ హెమ్స్‌వర్త్), ఒక కిరాయి సైనికుడు, బంగ్లాదేశ్‌లో ఒక ప్రమాదకరమైన మిషన్ నుండి బయటపడిన తర్వాత ఉద్యోగ విరమణ చేస్తాడు. ఆ తరువాత అతనిని ఒక అపరిచితుడు (ఐరిస్ ఎల్బా) సంప్రదిస్తాడు, అతని మాజీ భార్య మియా (ఓల్గా కురిలెంకో) ఖైదు చేయబడిన సోదరి కేతేవాన్ (టినాటిన్ డలాకిష్విలి), ఆమె పిల్లలు సాండ్రో (ఆండ్రో జపార్డైజ్), నినా (మార్తా)ని రక్షించమని అడుగుతాడు.
టైలర్ వారిని జైలు నుండి విడిపించడానికి అంగీకరిస్తాడు. అతని మిషన్‌ను ప్రారంభిస్తాడు. కేతేవన్, పిల్లలను ఎవరు బంధించారు? జురాబ్ (టోర్నికే గోగ్రిచియాని) ఎవరు.. అతను మిషన్‌తో ఎలా సంబంధం కలిగి ఉన్నాడు? టైలర్ తన మిషన్‌లో విజయం సాధించాడా? అన్నదానికి ప్రధాన సినిమాలో సమాధానాలున్నాయి.
నటీనటులు:
క్రిస్ హెమ్స్‌వర్త్, గోల్షిఫ్తే ఫరాహానీ, ఆడమ్ బెస్సా, ఓల్గా కురిలెంకో, డేనియల్ బెర్న్హార్డ్ట్, టినాటిన్ దలకిష్విలి, ఇద్రిస్ ఎల్బా
దర్శకుడు: సామ్ హర్గ్రేవ్
నిర్మాతలు: రస్సో బ్రదర్స్, క్రిస్ హెమ్స్‌వర్త్
సంగీత దర్శకులు: హెన్రీ జాక్మన్ మరియు అలెక్స్