ఫ్యాషనిస్ట్ ఈషా గుప్తా తాజా ఫోటోషూట్ యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ భామ లేటెస్టుగా స్టన్నింగ్ అవతార్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కిల్లర్ లుక్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పెంచడం ఈ భామకు కొత్తేమీ కాదు కానీ, ఈసారి ఫోటోగ్రాఫ్ కొన్ని కారణాలతో విమర్శలకు తావిచ్చింది.
బాలీవుడ్ నటి కం మోడల్ ఈషా గుప్తా తనదైన స్టైల్, గ్లామర్ ని ఎలివేట్ చేసినా కానీ ఇది ఒక హోటల్ ప్రచారం కోసం చేసిన ఫోటోషూట్ ఇది. వైట్ అండ్ వైట్ డిజైనర్ లుక్ లో కనిపించిన ఇషా లైట్ మేకప్ ఓపెన్ హెయిర్ తో కనిపించిం . స్టైలిష్ పోజులను కుర్రకారు మెచ్చుకున్నా, మరీ ఈ రేంజులో హోటల్ కి ప్రమోషన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
అసలు ఆ హోటల్ లాంచింగ్ కి ఈ ఫోజ్ కి సంబంధం ఏమైనా ఉందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. టూమచ్ గా ఎక్స్ పోజ్ చేసిందంటూ తనను కొందరు వేలెత్తి చూపారు. ఇషా తన లుక్స్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడం ఇదే మొదటిసారి కాదు…