నాటు నాటు కేవలం పాట మాత్రమే కాదన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావడంపై పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర స్పందించారు. శక్తి, ఆశావాదం, భాగస్వామ్యం, అసమానతలపై విజయం.. ..ఇది మినీ ఎపిక్ మూవీ. ఆస్కార్ వేదిక సహా ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ కాలు కదపడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, చంద్రబోస్ సహా చిత్ర బృందానికి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నా అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.ఈ సాంగ్ కొత్త చరిత్ర సృష్టించింది. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఈ పాట ఆస్కార్ (oscars 2023) పురస్కారాన్ని అందుకుంది. నాటు నాటు పాటకు అరుదైన అవార్డు దక్కడంతో ప్రముఖులంతా దర్శకధీరుడు రాజమౌళి బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు కవులు, కళాకారులు, రచయితలు భారత్‌కు దక్కిన గౌరవాన్ని వేనోళ్ల కొనియాడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement