వీరయ్య అంగ వైక్యలంతో ఇబ్బంది పడుతున్నా సరే కొడుకుని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటు-ంటాడు. వీరయ్య కొడుక్కి మాత్రం విమానం అంటే పిచ్చి. విమానం ఎక్కాలనే ఆలోచనలతో ఎప్పుడూ తన చుట్టూ ఉన్నవారిని ప్రశ్నిస్తూనే ఉంటారు. తండ్రిని కూడా విమానం ఎక్కించమని బతిమాలాడుకుంటూ ఉంటాడు. బాగా చదువుకుంటే నువ్వే విమానం ఎక్కవచ్చునని కొడుకుతో అంటు-ంటాడు వీరయ్య. తండ్రీ కొడుకుల మధ్య అసలు ఈ విమానం గోల ఏంటనేది తెలుసుకోవాలంటే ‘విమానం’ సినిమా చూడాల్సిందే అని చిత్రబృందం అంటోంది. తాజాగా ఈ సినిమా టీ-జర్ను విడుదల చేశారు.
టీ-జర్లో మాస్టర్ ధ్రువన్ కొడుకుగా నటిస్తే, తండ్రి పాత్రలో సముద్ర ఖని నటించారు. వీరి మధ్య సాగే విమానం సంభాషణ ఆసక్తికరంగా, సరదాగా ఉంది. అలాగే సినిమాలో బలమైన ఎమోషనల్ అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. ”నాన్నా ఎప్పుడు దేవుడు కనపడినా దండం పెట్టు-కోమంటావు ఎందుకు” అని అడిగిన కొడుకుతో ”మనం అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి” అని తండ్రి చెబుతాడు. దానికి ఆ పిల్లాడు ”అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు” అనే ఓ డైలాగ్ చాలు.. టీ-జర్లో తండ్రీ కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని సినిమాలో ఎలా చూపించారో చెప్పటానికి. ఈ ఎమోషనల్ జర్నీ జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో ‘విమానం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు.