Monday, December 2, 2024

Elli AvrRam | దేవ‌దాసు కోసం బాలీవుడ్ పార్వ‌తి..

బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్ కి దేవ‌దాస్ సినిమా అంటే పిచ్చి ఇష్టం. అందులో పారూగా న‌టించాల‌నుంద‌ని చాలా కాలంగా చెబుతోంది. రెండేళ్ల క్రితం దేవదాస్ నుండి పారూ వేషంలో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎల్లి కామెడీ షో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్’ ఛాలెంజ్‌ని హోస్ట్ చేస్తున్న రోజుల‌ నుండి ఇది త్రోబాక్ పిక్.

ఎల్లీ అవ్రామ్ దేవదాస్ నుండి పారూ వేషంలో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయింది. సంజయ్ లీలా భ‌న్సాలీ 2002 చిత్రం ‘దేవదాస్’ 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా, ఎల్లి పారూ లాగా దుస్తులు ధరించింది. మ‌ళ్లీ కొన్నాళ్ల త‌ర్వాత పార్వ‌తి రూపంలో మెరిసింది ఎల్లీ.

ఇది అమెజాన్ మ్యూజిక్ ఆల్బ‌మ్ అని ఇన్ స్టాలో వెల్ల‌డించింది. ఇటీవ‌ల వ‌రుస‌గా మ్యూజిక్ ఆల్బ‌మ్స్ లో న‌టిస్తోంది ఎల్లీ. సినిమాలు, వెబ్ సిరీస్ ల‌లో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో తీరిక స‌మ‌యాల్ని ఇలా ప్లాన్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement