కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 లాంటి భారీ ప్రాజెక్టును తెరకెక్కించిన ప్రశాంత్ నీల్.. తదుపరి ప్రాజెక్ట్ సలార్.. ప్రభాస్ తో చేయనున్న ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ ని కేజిఎఫ్ సినిమాను తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కేజీఎఫ్ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకి మరోసారి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. కాగా.. ఈ క్రేజీ కాంబో ప్రాజెక్టుపై ప్యాన్స్ అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ హీరోకి ఏ రేంజ్ లో ఎలివేఫన్స్ ఇస్తాడో తెలిసిందే.. అయితే అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్తలు ఇపుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.
ఇంతకీ ఆ విషయం ఏంటంటే ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకే మెయిన్ హైలెట్‌గా నిలిచేలా డిజైన్ చేశాడట ప్రశాంత్ నీల్. ఇండియన్ సినిమాలోనే ది బెస్ట్ ఇంటర్వెల్ ఎపిసోడ్‌గా చూపించబోతున్నాడని తాజా అప్ డేట్ చెప్పేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కేవలం ఈ సింగిల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చుపెడుతున్నారన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. లోయ ప్రాంతంలో ఈ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. లోయల్లో తీయబోయే భారీ ఛేజింగ్ అండ్ యాక్షన్ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని టాక్ నడుస్తోంది. కాగా.. 2023 వేసవిలో సలార్ విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..