బిట్ కాయిస్ మోసం కేసులో చర్యలు
శిల్పా,ఆమె భర్త కుంద్రాకి చెందిన అపార్ట్మెంట్
బంగ్లా, ఈక్విటీ షేర్లు సీజ్ …
వాటి విలువ వంద కోట్లకు వెల్లడి
సీనియర్ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆమెతోపాటు ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నేడు జప్తు చేసింది. ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో.. ముంబై సిటీ జూహూ ఏరియాలో శిల్పాశెట్టి పేరుతో ఉన్న అపార్ట్ మెంట్ ఫ్లాట్, అదే విధంగా పూణెలో శిల్పాశెట్టి పేరుతో ఉన్న బంగ్లా ఉన్నాయి. రాజ్ కుంద్రా పేరుతో ఉన్న ఈక్విటీ షేర్లను సైతం సీజ్ చేసింది ఈడీ.
బిట్ కాయిన్ రూపంలో నెలకు 10 శాతం రిటర్న్ ఇస్తామని 2017లో రూ. 6 వేల 600 కోట్లు వసూల్ చేసి అమిత్ భరద్వాజ్ ప్రజలను మోసం చేసినందుకు అతడిపై కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఈడీకి కేసును అప్పగించారు. కొన్నేండ్లుగా ఈడీ ఈ కేసుపై దర్యాప్తు చేస్తుంది. అమిత్ భరద్వాజ్ నుండి రాజ్ కుంద్రా 285 బిట్‌కాయిన్‌లను అందుకున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
మరికొన్ని ఆస్తుల రూపంలో ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల ప్రకారం రిపు సుదన్ కుంద్రా (రాజ్ కుంద్రా)కు చెందిన రూ. 97.79 కోట్లు అటాచ్ చేస్తున్నట్టు ఈడీ తెలిపింది. ఇందులో రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టి పేరు మీద ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్ కూడా ఉంది. పూణేలో ఉన్న రెసిడెన్షియల్ బంగ్లాను అటాచ్ చేస్తున్నట్టు ఈడీ వెల్లడించింది.