Tuesday, October 8, 2024

Dasara Special | థియేట‌ర్ల‌లో ద‌సరా సందడి….

ద‌సరా పండ‌క్కు థియేట‌ర్ల‌లో సందడి నెల‌కొన‌నుంది. ఈసారి స్టార్ హీరోల సినిమాల కంటే ఎక్కువ‌గా చిన్న సినిమాలే పోటీకి థియేట‌ర్ల‌లో పోటీకి దిగుతున్నాయి. దాదాపు అరడజను సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

రిలీజ్ కానున్న సినిమాలివే !

అక్టోబర్ 10న రజినీకాంత్ ‘వెట్టయాన్’ సినిమాతో రాబోతున్నాడు. అక్టోబర్ 11న…. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సుహాస్ ‘జనక అయితే గనక’ రిలీజ్ కానుంది. దాంతో పాటు, శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ ‘విశ్వం’…. నాన్న ఎమోషన్ తో సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమాలు కూడా అక్టోబర్ 11న రిలీజ్ కానున్నాయి.

ఇక బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టించిన‌ లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘జిగ్రా’…. ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కిన కన్నడ యాక్షన్ ఎంట‌ర్‌‌టైనర్ ‘మార్టిన్’ అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement