దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్నారు. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించింది. రానా దగ్గుబాటి, నేచురల్ స్టార్ నాని ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ” కింగ్ ఆఫ్ కోత మా అందరి డ్రీమ్ ప్రాజెక్ట్. గత ఏడాది అంతా ఈ చిత్రం పైనే వర్క్ చేశాం. నా కెరీర్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. ‘కింగ్ ఆఫ్ కోత’ నేను బలంగా నమ్మి చేసిన గ్యాంగ్ స్టార్ డ్రామా. భాషలకు అతీతంగా చిత్రాలని ఆదరిస్తున్నాను. ‘కింగ్ ఆఫ్ కోత’ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రం కోసం నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పాను. తెలుగులో నా వాయిస్ వుంటు-ంది. అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ ” దుల్కర్ ఒక యాక్షన్ సినిమా చేయడం ఈ ఆసక్తి కలిగించింది. తను చాలా పద్దతైన వ్యక్తి. మృదు స్వభావి. తను ఇలాంటి యాక్షన్ సినిమా చేయడం చాలా ఎక్సయి-టె-డ్ గా వుంది. అన్నారు.
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. దుల్కర్ తన తెలుగు కెరీర్ స్టార్ట్ చేసిన దాంట్లో నా వాయిస్ (ఓకే బంగారం )కూడా వుంది. తెలుగులో తన కెరీర్ తదుపరి స్థాయికి వెళుతున్న ఈ తరుణంలో నేను ఈ వేడుకలో వుండటం చాలా ఆనందంగా వుంది. అన్నారు.
ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ కింగ్ ఆఫ్ కోత మీ అందరికీ నచ్చుతుంది. థియేటర్స్ లో కలుద్దాం అన్నారు. ఈ వేడుకలో నిర్మాత స్రవంతి రవి కిషోర్, నిమ్మకాయల ప్రసాద్ తో పాటు- చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు