Thursday, September 19, 2024

Dulquer Salmaan | దీపావళి బరిలో ‘లక్కీ భాస్కర్’..

వెంకీ అట్లూరి దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్న మూవీ ‘లక్కీ భాస్కర్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు…సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా, ఈ సినిమా విడుదల తేదీని మొదట సెప్టెంబర్ 27న ఫిక్స్ చేయగా, దాన్ని వాయిదా వేస్తూ కొత్త విడుదల తేదీని ఫిక్స్ చేశారు మేకర్స్. దీపావళి కానుకగా అక్టోబర్ 31న లక్కీ భాస్కర్ విడుదల చేయ‌నున్న‌ట్ట‌లు ప్ర‌క‌టించారు.

ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌లో నిర్మాత సూర్య దేవర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్యలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. కాగా, ఈ తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement