Monday, September 16, 2024

Dulkar Salman | టాలీవుడ్‌లో దుల్కర్ జోరు..

మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజాగా మరో తెలుగు డైరెక్టర్‌తో కొత్త సినిమాను ప్రకటించారు. ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సాధించిన దుల్కర్… వరసుగా తెలుగు డైరెక్టర్లకి ఓకే చెబుతున్నారు దుల్కర్. ఇక తాజాగా యంగ్ డైరెక్టర్ పవన్ సాదినేని దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ఆకాశంలో ఒక తార అనే టైటిల్‌ను కూడా ప్రకటించారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు లైట్ బాక్స్, స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో దుల్కర్‌తో పాటు ఎవరు నటించబోతున్నారనే విషయాలు ఇంకా ప్రకటించలేదు. ఈచిత్రం 2025లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

లక్కీ భాస్కర్

ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే తెలుగు సినిమా చేస్తున్నారు దుల్కర్… ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement