కోలీవుడ్ హీరో అజిత్ కి కార్, బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ప్యాషన్ తోనే తొలిసారిగా దుబాయ్ లో రేసింగ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. దుబయి కార్ రేసింగ్ లో అజిత్ టీం ”అజిత్ కుమార్ రేసింగ్ బై బీకేఆర్” థర్డ్ ప్లేస్ లో నిలిచింది. దుబయి వేదికగా జరిగిన 24హెచ్ రేసులో… థర్డ్ ప్లేస్ తో పాటు స్పిరిట్ ఆఫ్ ది రేస్ అవార్డును కూడా అజిత్ టీమ్ సొంతం చేసుకుంది.
అయితే ఈ రేసింగ్ ఈవెంట్‌కు ముందు ప్రాక్టీస్‌లో… అజిత్ కారు ట్రాక్‌పై ప్రమాదానికి గురైంది. ప్రమాదాన్ని పక్కనపెట్టి కలిసికట్టుగా శ్రమించి మూడో స్థానం దక్కించుకున్నారు. దీంతో అజిత్ కు, ఆయన టీమ్ కు అభినందనలు తెలుపుతూ పలువురు ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. రేసులో అజిత్ టీమ్ విజయం సాధించిన వీడియోలు, ఫొటోలు షేర్ చేశారు.